Video : మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కి ప్రమాదం తప్పింది.

By Medi Samrat  Published on  3 Feb 2025 9:21 PM IST
Video : మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కి ప్రమాదం తప్పింది. ఫుట్ పాత్ పై నడుస్తున్న ఆమె ఒక్కసారిగా జారిపడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఓ ఈవెంట్ కు వెళ్లిన మేయర్ కింద పడిపోయారు. ఆమెకు స్వల్ప గాయాలైనట్లు మేయర్ వ్యక్తిగత సిబ్బంది తెలిపింది.


సుందరీకరణ పనుల్లో భాగంగా పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద స్ట్రీట్ లైట్ పోల్ తగులుకుని ఆమె కింద పడింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు, కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


Next Story