హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ కోల్పోగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఒకరు మృతిచెందారు. వివరాళ్లోకెళితే.. ఎయిర్‌పోర్టులో డ్రైనేజీ లీకేజీల కోసం సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పైపులు సరిచేసే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో అక్కడ పనిచేస్తున్న నర్సింహారెడ్డి, జాకీర్, ఇలియాస్ అనే ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక స్పృహకోల్పోయారు. ఆ ముగ్గురు వ్యక్తులను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నర్సింహారెడ్డి(42) మృతిచెందినట్టుగా చెబుతున్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టుగా ఎయిర్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.