గోశామహల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నానని గోశామహల్ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ గ్రంథాలయ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టిక్కెట్ ఎవరికి వస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. టిక్కెట్‌పై గందరగోళం పరిస్థితి నెలకొంది.. పేపర్లలో కూడా కొందరి పేర్లు వస్తున్నాయని అన్నారు. ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యే టిక్కెట్‌లకు అభ్యర్ధుల ప్రకటన పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
అక్టోబర్ 6వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 10వేల మందితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. నాకు టిక్కెట్ ఫిక్స్ అయ్యిపోయిందని.. కొంతమంది చెప్పుకుంటున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని నిరూపించుకోవాలని అన్నారు. దళిత వాడలలో నిద్ర, జాబ్ మేళా, ఉచిత డిగ్రీ సీట్లు ఇవ్వడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నానని తెలిపారు.
బీఆర్ఎస్ అధిష్టానం సర్వే ఎవరికి వస్తే వారికే టిక్కెట్ ఇవ్వాలని అన్నారు. గోశామహల్ నియోజకవర్గంలో బీజేపీకి ఓడించడం ఏకైక లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. గోశామహల్ లో బీజేపీని ఒడిస్తే రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి తాళం పడుతుందన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ కేటాయిస్తే.. గోశామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి బంగారు పళ్లెంలో పెట్టి కానుకగా ఇస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే రూ.11 లక్షల విలువ చేసే బంగారు పళ్లెన్ని మీడియా ముందు ప్రదర్శించారు. 10వేల మందికి వరల్డ్ ఫేమస్ ప్యారడేజ్ బిర్యానీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.