జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ: హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
By - Knakam Karthik |
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ: హరీశ్‌రావు
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఎర్రగడ్డ మోతి నగర్ వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుంది. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కాదు మా ఇంటి గోపీనాథ్ గా మీరందరూ ఆదరించారు. దురదుష్టవశాతూ ఆయన చనిపోయారు. ఆ కుటుంబానికి, వారి పిల్లలకి అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండ్ ఓవర్ చేశారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారు..అని విమర్శలు చేశారు.
సునీతమ్మ ఒక్కరు కాదు. సునీతమ్మ వెంట కేసీఆర్, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంది. జూబ్లీహిల్స్ లో సునీతమ్మ గెలుపుతో రాష్ట్రానికి మేలు జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ప్రజలందరూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరి చేయాలంటే మళ్ళీ ఇంకెంత సమయం పడుతుందో. హైదరాబాదులో బీఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించింది. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా?..అని హరీశ్‌రావు ప్రశ్నించారు.