సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా పరుగులు తీశారు

By Medi Samrat  Published on  23 Aug 2024 4:42 PM IST
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా పరుగులు తీశారు. అసలు ఏమైందో కూడా తెలియని పరిస్థితిలో కస్టమర్లు తినడం ఆపేసి మరీ పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. హోటల్లో పని చేసే ఓ యువకుడు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు.

సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్ కింద ఉన్న సెల్లార్‎లో జనరేటర్ ఓవర్ హిట్ వల్లనే మంటలు వ్యాపించినట్లు ఫైర్ ఆఫీసర్ ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లలో ప్యారడైజ్ హోటల్ ఒకటి. బిరియానీకి బాగా ఫేమస్.

Next Story