హైదరాబాద్ నాచారంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident at JP Industries Nacharam in Hyderabad. హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By Medi Samrat
Published on : 12 April 2023 6:15 PM IST

హైదరాబాద్ నాచారంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రజలను భయపెడుతూ ఉన్నాయి.


Next Story