బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
fire accident at chemical factory in IDA Bollaram. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
By Medi Samrat Published on
12 Dec 2020 11:35 AM GMT

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో మంటలు ఎగసిపడ్డాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండడంతో.. కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటలు ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో అధికారులు సమీపంలోని పరిశ్రమలను కూడా ఖాళీ చేయిస్తున్నారు. పేలుళ్లు, మంటలతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.. దాదాపు కిలోమీటర పరిధిలో పొగ కమ్ముకుపోయింది. కంపెనీలోని రియాక్టర్ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు.
Next Story