బయటకొచ్చిన సీసీటీవీ విజువల్స్.. గాంధీ ఆసుపత్రిలో దారుణం

గాంధీ హాస్పిటల్ క్యాజువాలిటీ విభాగంలో ఇంటర్న్‌గా పనిచేస్తున్న మహిళా డాక్టర్‌పై ఓ రోగి దాడి చేశాడు

By Medi Samrat  Published on  11 Sept 2024 9:15 PM IST
బయటకొచ్చిన సీసీటీవీ విజువల్స్.. గాంధీ ఆసుపత్రిలో దారుణం

గాంధీ హాస్పిటల్ క్యాజువాలిటీ విభాగంలో ఇంటర్న్‌గా పనిచేస్తున్న మహిళా డాక్టర్‌పై ఓ రోగి దాడి చేశాడు. జూనియర్ డాక్టర్ క్యాజువాలిటీ వార్డులో మరొక రోగికి చికిత్స చేస్తున్నప్పుడు 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి దాడి చేశాడు. డాక్టర్‌ను పట్టుకుని దాడి చేయడమే కాకుండా ఆమె ఆప్రాన్ కూడా చిరిగిపోయింది.

గాంధీ ఆసుపత్రిలో జరిగిన సంఘటన కు సంబంధించిన CCTV ఫుటేజ్‌ బయటకు వచ్చింది. అందులో సిబ్బంది, రోగులు ఆమెను రక్షించడానికి పరుగెత్తటం, ఆ వ్యక్తి నుండి వైద్యురాలిని విడిపించడానికి అతనిని కొట్టడం చూడొచ్చు. ఈ సంఘటన తర్వాత, రోగి పారిపోవడానికి ప్రయత్నించాడు. చివరికి ప్రధాన గేటు వద్ద ప్రత్యేక రక్షణ దళం (SPF) సిబ్బంది పట్టుకున్నారు. రోగిని ఆన్‌సైట్ అవుట్‌పోస్ట్‌లో పోలీసులకు అప్పగించారు. చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు.

ఈ దాడిని గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JUDA) తీవ్రంగా ఖండించింది. వైద్య సిబ్బంది భద్రతపై సరైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story