అక్రమ నిర్మాణాల కూల్చివేత‌

జేఎన్‌టీయూ రైతుబజార్‌, కూకట్‌పల్లిలోని తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు

By Medi Samrat  Published on  21 May 2024 12:39 PM IST
అక్రమ నిర్మాణాల కూల్చివేత‌

జేఎన్‌టీయూ రైతుబజార్‌, కూకట్‌పల్లిలోని తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్‌ఎంసీ రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని నిర్మాణాలు వాణిజ్య సంస్థలకు చెందినవే!! కూల్చి వేసిన వాటిలో రెండు దుకాణాల మెట్లతో సహా పలు కాంక్రీట్ భాగాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేశారు. మిగిలిన రెండు సంస్థలు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్నాయి. ఫుట్‌పాత్‌ల మీద వ్యాపారాలు చేసే బండ్లను కూడా అక్కడి నుండి తొలగించారు.

హైదరాబాద్​ నగరంలోనే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాల్లో కబ్జాలపై వస్తున్న ఫిర్యాదుల గురించి అధికారులు వేగంగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి ఇంటర్నల్​ రిపోర్ట్​ తెప్పించుకున్నారు. హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో భూ ఆక్రమణ, కబ్జాదారులపై పోలీసు కమిషనర్లు వివరాలు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పసుమాములలో సర్వే నంబర్‌ 422లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన అనధికార నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సుమారు 20 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించి షెడ్లు వేయగా వాటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

Next Story