ఇండియన్ రేసింగ్ లీగ్‌కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..!

ఇండియన్ రేసింగ్ లీగ్‌కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ త‌గిలింది. హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్

By Medi Samrat  Published on  31 Oct 2023 9:59 PM IST
ఇండియన్ రేసింగ్ లీగ్‌కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..!

ఇండియన్ రేసింగ్ లీగ్‌కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ప‌డింది. హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ ఎన్నిక‌ల కార‌ణంగా రద్దు అయ్యింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండడంతో నిర్వాహకులు రేసింగ్ ఈవెంట్‌ను చెన్నైకి తరలించారు. నిర్వాహకులు ఇప్ప‌టికే హుసేన్ సాగర్ తీరాన సగం వరకూ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నవంబర్ 4, 5 తేదీల్లో F4 ఇండియ‌న్ చాంఫియ‌న్ షిప్‌, ఇండియ‌న్‌ రేసింగ్ లీగ్ ఉంటుందని పెద్ద ఎత్తున‌ ప్రచారం కూడా చేశారు. ఆన్‌లైన్‌లో ఇప్పటికే టికెట్ల అమ్మకం కూడా పూర్త‌య్యింది.

ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా హైద్రాబాద్ నుంచి వేదిక‌ను చెన్నైకు షిప్ట్ చేస్తున్నామ‌ని నిర్వాహ‌కులు ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. హైద్రాబాద్‌లో ఈవెంట్ ర‌ద్దైన నేప‌థ్యంలో టికెట్లు బుక్ చేసుకున్న‌వారికి డ‌బ్బులు తిరిగి ఇచ్చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అసౌక‌ర్యానికి క్ష‌మించ‌మ‌ని కోరుతూ.. చెన్నైలో జ‌రిగే రేసింగ్ ఈవెంట్‌కు హాజ‌రుకావాల‌ని అభిమానుల‌కు ఆహ్వానం ప‌లికింది.


Next Story