హైద్రాబాద్‌లో ఈడీ దాడులు.. రంగంలోకి 11 బృందాలు

ED Searches at 15 locations in Mumbai four major medical groups in Hyderabad. కోవిడ్-19 సమయంలో బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో రూ. 12000 కోట్ల కుంభకోణానికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2023 12:43 PM GMT
హైద్రాబాద్‌లో ఈడీ దాడులు.. రంగంలోకి 11 బృందాలు

కోవిడ్-19 సమయంలో బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో రూ. 12000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం నాడు హైదరాబాద్‌లోని నాలుగు ప్రధాన మెడికల్ గ్రూప్‌లు కామినేని, ఎస్‌విఎస్, ప్రతిమ, మెడిసిటీపై దాడులు నిర్వహించింది.

కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ, ప్రతిమా కార్పొరేట్ కార్యాలయాలలో ఈ సోదాలు సాగుతున్నాయి. ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా అధికారులు బయలుదేరారు. ఈడీ బృందాలతో పాటుగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూడా వారి వెంట వెళ్లాయి.

ముంబైలో, IAS అధికారి సంజీవ్ జైస్వాల్, శివసేన UBT నాయకుల ఇద్దరు సన్నిహితులు, BMC కి చెందిన కొంతమంది అధికారులు, ఇతర వ్యక్తులకు సంబంధించిన ప్రదేశాలలో ఈ దాడులు నిర్వహించారు. శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ సన్నిహితుడుగా చెప్పబడుతున్న వ్యాపారవేత్త సుజిత్ పాట్కర్‌పై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. ఉద్ధవ్ ఠాక్రే హయాంలో ముంబైలో కోవిడ్ కేంద్రాల ఏర్పాటులో అక్రమాలు జరిగాయని కేసులు నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాట్కర్, అతని ముగ్గురు భాగస్వాములు COVID-19 మహమ్మారి సమయంలో ఫీల్డ్ హాస్పిటల్స్ నిర్వహణ కోసం అక్రమంగా కాంట్రాక్టులను పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఆగస్ట్ 2022లో, లైఫ్‌లైన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ, పాట్కర్, ఆయన ముగ్గురు పార్ట్నర్స్ పై ​​గత ఏడాది ఆగస్టులో ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ ఫోర్జరీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ కేసు నమోదు చేసిందని అధికారులు తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య సదుపాయాల కోసం కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి BMC కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఈ ఏడాది జనవరిలో ED ముందు హాజరయ్యారు. ఆజాద్ మైదాన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, జూన్ 2020లో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నకిలీ పత్రాలను BMCకి సమర్పించారు. వైద్యరంగంలో ఎలాంటి అనుభవం లేకుండా COVID-19 కేంద్రాల మెయింటెనెన్స్ ఒప్పందాలను పొందారు. ఈ COVID-19 కేంద్రాలలో సిబ్బందికి, వైద్యులకు సరైన ధృవీకరణ పత్రాలు లేవని, చికిత్స అందించడంలో విఫలమయ్యారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఇలా మోసం చేయడం వలన ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని .. ప్రజలు బాధపడ్డారని ఎఫ్ఐఆర్ లో ఉంది.


Next Story