హైదరాబాద్‌లో భూకంపం.. టెన్షన్ లో ప్రజలు

Earthquake In Hyderbad. దేశంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మనకు భూకంపాల ప్రభావం కాస్త తక్కువే..! అలాంటిది నేడు

By Medi Samrat
Published on : 26 July 2021 10:10 AM IST

హైదరాబాద్‌లో భూకంపం.. టెన్షన్ లో ప్రజలు

దేశంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మనకు భూకంపాల ప్రభావం కాస్త తక్కువే..! అలాంటిది నేడు హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.0గా నమోదయ్యింది. హైదరాబాద్‌కు 156 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సోమవారం ఉదయం 5 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయింది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది.

తక్కువ తీవ్రతతో భూకంపం రావడంతో ఆస్తి నష్టం పెద్దగా జరిగి ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో భారత్ లోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే..! తాజాగా హైదరాబాద్ లో భూకంపం వచ్చిందనే వార్త తెలియగానే ప్రజలు కాస్త టెన్షన్ పడుతూ ఉన్నారు. కొద్ది నెలల కిందట భూమి లోపల ఏవేవో శబ్దాలు వస్తూ ఉండడంతో ప్రజలు చాలా ప్రాంతాల్లో భయపడి ఆరు బయటనే పడుకున్న సందర్భాలు ఉన్నాయి.


Next Story