ఇది తెలిస్తే హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో తినాలంటే భయపడతారేమో.!

హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ లో డ్రైనేజీ నీటిలో పాత్రలను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

By Medi Samrat
Published on : 6 Sept 2024 8:31 PM IST

ఇది తెలిస్తే హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో తినాలంటే భయపడతారేమో.!

హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ లో డ్రైనేజీ నీటిలో పాత్రలను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతపై మరిన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో యూసుఫ్‌గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్‌లో సిబ్బంది మురికి నీటిలో టీ గ్లాసులు, ప్లేట్‌లను కడుగుతున్నట్లు చూడొచ్చు. ఈ ఫుటేజ్ రెస్టారెంట్‌లోని పరిశుభ్రత గురించి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ రెస్టారెంట్‌లో తదుపరి విచారణలో వాషింగ్ ఏరియా దగ్గర డ్రైనేజీ పైపు లీకవడం వల్ల పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీరు కలుషితమైందని తేలింది. హోటల్ యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. వారి నిర్లక్ష్యం కారణంగా పరిశుభ్రత ప్రమాణాలను విస్మరించారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసారు.


Next Story