ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు పోగొట్టుకుని, అప్పు తీర్చేందుకు మేనమామ ఇంట్లో నగలు అపహరించిన యువకుడిని టాస్క్‌ఫోర్స్‌తో పాటు రాంగోపాల్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి 32 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాంగోపాల్‌పేటకు చెందిన సూరజ్‌మలాని (29) ఫిర్యాదుదారు గోపాల్ దాస్ మేనల్లుడు. ఈజీ మనీ కోసం సూరజ్ క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు నిర్వహించాడని, ఇటీవల భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడని పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చేందుకు సూరజ్ ఫిబ్రవరి 11న తన మామ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. గోపాల్ దాస్ ఫిర్యాదు, అనుమానం మేరకు సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు.