హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు

Cricket betting rackets busted. సికింద్రాబాద్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసిన హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్

By Medi Samrat  Published on  7 May 2022 2:16 PM GMT
హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు

సికింద్రాబాద్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసిన హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (నార్త్) శుక్రవారం నాడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బంగారు ఆభరణాల పనులు చేసుకుంటున్న 10 మంది పశ్చిమ బెంగాల్ వ్యక్తులు పట్టుబడ్డారు.

మొదట పట్టుకున్న వారికి సంబంధించి మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిగూడలో ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. చంద్రశేఖర్ (41), దిలీప్ దార్ (34), కార్తీక్ గుచైత్ (47), దీపక్ పంజా (28), రాబిన్ కోలే (25) ల నుంచి రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ 'www.cricketbet9.com' యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, తనకు తెలిసిన వ్యక్తులను బెట్టింగ్‌లకు ఆహ్వానిస్తున్నాడని టాస్క్ ఫోర్స్ డిసిపి పి రాధా కిషన్ రావు తెలిపారు.

రెండో ఘటనలో అశోక్‌నగర్‌ పాట్‌మార్కెట్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులు గియాసుద్దీన్ (40), ఎన్ రంభవ్ అర్జున్ (40), సరిఫుల్ షేక్ (48), షేక్ జమీర్ (48), సుజిత్ కుమార్ హాలిదర్ (43) లను పట్టుకున్నారు. అంతేకాకుండా రూ.1.18 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "గియాసుద్దీన్ అర్జున్ సహాయంతో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు" అని డిసిపి చెప్పారు.

Next Story
Share it