విషాదం : రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య
Couple commits suicide by running in front of train in Hyderabad. హైదరాబాద్‌లోని బోలారం రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి ఓ జంట రైలు కింద పడి
By Medi Samrat Published on
1 Feb 2022 7:45 AM GMT

హైదరాబాద్‌లోని బోలారం రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య పాల్పడిన దంపతులను వై. కొండయ్య (55), అతని భార్య భూలక్ష్మి (50)గా గుర్తించారు. కొండయ్య ఆర్మీ ఎస్టాబ్లిస్‌మెంట్స్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. భార్య భూలక్ష్మి (50) రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కాప్రాలోని నేతాజీనగర్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. వీరివురు కుమార్తెతో కలిసి సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
సోమవారం, దంపతులు తమ ఇంటి నుండి కనిపించకుండా పోవడంతో వారి కుమార్తె కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం బోలారం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై దంపతుల మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్‌లోకి జారుకోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story