నూతన తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు.
సచివాలయం పక్కనే అత్యంత ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని, ఇది ప్రజాప్రతినిధులు, అధికారులు తమ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించాలని గుర్తుచేస్తుంది అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి స్మారకార్థం సచివాలయం ఎదుట అమరవీరుల స్మారకం నిర్మిస్తున్నారు.
అమరవీరుల త్యాగాలు, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సచివాలయం సుపరిపాలనకు ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
దేశంలోనే ధోల్పూర్ రాయిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించిన ఏకైక భవనం తెలంగాణ సచివాలయం. టెర్రకోట వాల్ క్లాడింగ్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు.
అత్యాధునిక CCTV కెమెరాలతో సహా హైటెక్ భద్రతా వ్యవస్థలు, రికార్డుల కోసం స్ట్రాంగ్ రూమ్‌లు, జాతీయ మరియు అంతర్జాతీయ అతిథుల కోసం చక్కగా ఏర్పాటు చేయబడిన సమావేశ మందిరాలు.. వంటివి సచివాలయాన్ని దేశంలోనే ప్రత్యేకంగా నిలబెడతాయి.