షాద్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ క‌ద‌లిక‌లు..!

Cheddi gang in Hyderabad again. రంగారెడ్డిలోని షాద్‌నగర్‌లో పేరుమోసిన చెడ్డీ గ్యాంగ్‌ల కదలికలు వెలుగులోకి రావడంతో స్థానికులు

By Medi Samrat  Published on  23 Oct 2022 5:59 PM IST
షాద్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ క‌ద‌లిక‌లు..!

రంగారెడ్డిలోని షాద్‌నగర్‌లో పేరుమోసిన చెడ్డీ గ్యాంగ్‌ల కదలికలు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిగి రోడ్డులోని మై హోమ్ వెంచర్‌లోని ఓ ఇంటి ఎదుట‌ గ్యాంగ్‌ సభ్యుల కదలికలు కనిపించిన‌ట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు ఆవరణలో అమర్చిన నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో చెడ్డీ గ్యాంగ్ ను పోలిన నలుగురు వ్య‌క్తులు ఆయుధాలతో వెంచర్‌లో తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.



Next Story