హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో మార్పులు

మంగళవారం నుండి ఉదయం 5:30 గంటలకే అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ప్రకటించింది.

By Medi Samrat  Published on  29 July 2024 9:15 PM IST
హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో మార్పులు

మంగళవారం నుండి ఉదయం 5:30 గంటలకే అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ప్రకటించింది. "మంగళవారం, 30 జూలై 2024న మొదటి మెట్రో రైలు అన్ని టెర్మినల్ స్టేషన్‌ల నుండి ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ మెట్రోతో ఎక్కువ గంటలు, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి!" అంటూ హైదరాబాద్ మెట్రో ప్రకటనను విడుదల చేసింది.

సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుండడంతో ప్రయోగాత్మకంగా శుక్రవారం ఉదయం 5.30 నుంచే మెట్రో రైలును నడిపామని, ఆ సమయంలో ప్రయాణీకుల ఆదరణ ఎక్కువగా ఉండడంతో ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో సేవలను అందించాలని నిర్ణయించామని మెట్రో అధికారులు తెలిపారు.

Next Story