టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బంజారాహిల్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ప్రత్యూష శవమై కనిపించింది. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ను పోలీసులు గుర్తించారు. ప్రత్యూష కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులకు సమాచారం అందించారు. ప్రత్యూష డిప్రెషన్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రత్యూష అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి హైదరాబాద్‌లో కెరీర్ ప్రారంభించింది. 2013లో ప్రత్యూష తన పేరు మీద ఒక లేబుల్‌ని ప్రారంభించింది. ఆమె టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖుల కోసం పనిచేసింది. ఆమె ఖాతాదారులలో చాలా పెద్ద ప్రముఖులు ఉన్నారు.