అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ఊరట

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ఉల్లంఘనకు సంబంధించి మొఘల్‌పురా పోలీసులు దాఖలు చేసిన కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్లను చార్జిషీట్ నుండి తొలగించారు.

By Medi Samrat  Published on  6 July 2024 9:15 PM IST
అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ఊరట

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ఉల్లంఘనకు సంబంధించి మొఘల్‌పురా పోలీసులు దాఖలు చేసిన కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్లను చార్జిషీట్ నుండి తొలగించారు. అమిత్ షా, కిషన్ రెడ్డి ఇద్దరూ MCCని ఉల్లంఘించలేదని హైదరాబాద్ పోలీసులు నిర్ధారించిన తర్వాత పేర్లను తొలగించారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మే 1వ తేదీన పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం చేశారు. మాధవి లత మాట్లాడుతుండగా.. వేదికపైకి పిల్లలు వచ్చారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు, మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బార్ 400 సీట్లు అనే ప్లకార్డ్స్ ఉన్నాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఈసీ విచారణ జరపాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొఘల్ పుర పీఎస్‌లో సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Next Story