పోలీసులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని పార్టీ కార్యకర్తలను కోరినందుకు బీజేపీ కార్పొరేటర్ కె.నర్సింహారెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై దాడులు చేయాలంటూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టినందుకు బీజేపీ నేత, మున్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై పలుకేసులు నమోదయ్యాయి. ఎల్బీనగర్ పీఎస్‌లో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. పోలీసులపై దాడులు చేయాలని నర్సింహారెడ్డి పోస్టులు చేశారని, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విధ్వంసానికి ప్రేరేపించారనే అభియోగాలతో ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలను నరసింహారెడ్డి మంగళవారం రాత్రి తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ పోలీసులను టార్గెట్ చేసి దాడి చేయాలని ఆయన పరోక్షంగా పార్టీ కార్యకర్తలను కోరారు. కార్పొరేటర్ సోషల్ మీడియా ఖాతాను గమనించిన పోలీసులు భారత శిక్షాస్మృతిలోని 153 ఎ, 505 (2), 506, 189 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి కార్పొరేటర్ ఖాతాల స్క్రీన్‌షాట్‌లు, ఐపీ అడ్రస్‌లను సేకరించారు.