రాజాసింగ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం

ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై గోశామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

By Medi Samrat  Published on  30 Aug 2023 2:41 PM IST
రాజాసింగ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం

ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై గోశామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూడో హిందుత్వ వాది అని మండిప‌డ్డారు. రాజాసింగ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం అని హితువు ప‌లికారు. బీఆర్ఎస్‌ లో చేరను అంటున్న రాజాసింగ్.. ఎవరు నిన్ను ఆహ్వానించారని ప్ర‌శ్నించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు.

రాజాసింగ్ రాజకీయ జీవితం సమాప్తం అయ్యింద‌న్నారు. రాజాసింగ్ అవినీతి తారాస్థాయికి చేరిందని.. అందుకే బీజేపీ సస్పెండ్ చేసిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజాసింగ్ సూడో హిందుత్వవాదిగా రాజకీయ పబ్బం గడుపుతున్నాడని.. వెంటనే రాజకీయాలు వదిలి.. సన్యాసం తీసుకోవడం ఉత్తమ మార్గం అని సూచించారు. రాజాసింగ్ ను ఏ పార్టీ కూడా చేర్చుకోదన్నారు. ఆయన మతతత్వ శక్తులతో రాజకీయాలు చేస్తున్నారని విమ‌ర్శించారు. రాజాసింగ్ హాయంలో గోశామహల్ నియోజకవర్గం 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేద‌న్నారు.

Next Story