మైలార్‌దేవ్‌ప‌ల్లి ప‌రిధిలో పేలుడు క‌ల‌కలం.. మ‌హిళ మృతి

Blast in Rangareddy District Mylardevpally.రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌ప‌ల్లి ప‌రిధిలో పేలుడు క‌ల‌కలం సృష్టించింది. ఈ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2022 5:47 AM GMT
మైలార్‌దేవ్‌ప‌ల్లి ప‌రిధిలో పేలుడు క‌ల‌కలం.. మ‌హిళ మృతి

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌ప‌ల్లి ప‌రిధిలో పేలుడు క‌ల‌కలం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ మృతి చెంద‌గా మ‌రొక‌రికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. నందనవనంలో సుశీలమ్మ, రంగ‌ముని దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరు నిత్యం చెత్తా చెదారం సేక‌రించి జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆనంద్‌న‌గ‌ర్‌లోని పారిశ్రామిక వాడ‌లో ఆదివారం ఉద‌యం చెత్త సేక‌రించేందుకు సుశీలమ్మ, ఆమె భ‌ర్త రంగమునితో క‌లిసి ఆటోలో వెళ్లారు. చెత్త సేక‌రిస్తున్న క్ర‌మంలో పేలుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో సుశీల‌మ్మ అక్క‌డికక్క‌డే మృతి చెందింది. ఆమె భ‌ర్త రంగ‌మునికికు తీవ్ర‌గాయాలు అయ్యాయి.

రోడ్డు ప‌క్క‌గా ఉన్న‌ గ్రానైట్ రాళ్ల ప‌క్క‌నే ఉన్న చెత్త‌ను సేక‌రిస్తుండ‌గా పేలుడు జ‌రిగిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సుశీలమ్మ మృత‌దేహం చిధ్ర‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన రంగ‌ముని ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు బాంబు పేలుడుపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేప‌ట్టారు. శంషాబాద్ డీసీపీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Next Story