Video : ఓల్డ్ సిటీలో చేతబడి కలకలం.. గాజు గ్లాసుపై మహిళ బొమ్మ

ఆదివారం ఓల్డ్ సిటీలోని సుల్తాన్ షాహీ వద్ద ఉన్న దైరా మీర్ మోమిన్ వద్ద చేతబడి జరిగిందంటూ ఎంఐఎం నేతలు ఆరోపించారు.

By Medi Samrat  Published on  11 Nov 2024 4:56 PM IST
Video : ఓల్డ్ సిటీలో చేతబడి కలకలం.. గాజు గ్లాసుపై మహిళ బొమ్మ

ఆదివారం ఓల్డ్ సిటీలోని సుల్తాన్ షాహీ వద్ద ఉన్న దైరా మీర్ మోమిన్ వద్ద చేతబడి జరిగిందంటూ ఎంఐఎం నేతలు ఆరోపించారు. సమాధి దగ్గర గాజు సీసాకు ఒక మహిళ చిత్రం అతికించడం చూడొచ్చు. ఈ వార్త తెలియడంతో ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫెకర్ అలీ శ్మశానవాటికకు చేరుకుని పరిశీలించారు. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అలీ అధికారులను కోరారు. ఈ సంఘటన గురించి మీడియాతో అలీ మాట్లాడుతూ దైరా మీర్ మోమిన్ సమీపంలో ఒక ఫోటోను గాజుకు కట్టి సమాధిపై ఉంచినట్లు తెలుస్తోందని అన్నారు.

దైరా మీర్ మోమిన్ కు సరైన భద్రత కల్పించాలన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేయగా స్థానికులు అడ్డుకోవడంతో గోడ నిర్మాణం కాస్తా నిలిచిపోయింది. స్థానికులతో సమావేశం నిర్వహించి శ్మశాన వాటికకు భద్రత కల్పిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని అలీ ప్రజలకు హామీ ఇచ్చారు. దైరా మీర్ మోమిన్ వద్ద మెరుగైన నిఘా కోసం స్మశాన వాటిక చుట్టూ సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని పోలీసులను స్థానికులు కోరారు.

Next Story