మిథాలీ రాజ్‌తో బీజేపీ చీఫ్ నడ్డా భేటీ

BJP chief Nadda meets Mithali Raj. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ శనివారం రాజీవ్ గాంధీ

By Medi Samrat
Published on : 27 Aug 2022 5:06 PM IST

మిథాలీ రాజ్‌తో బీజేపీ చీఫ్ నడ్డా భేటీ

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ శనివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ ఇంచార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమీప భవిష్యత్తులో మిథాలీ రాజ్ రాజకీయ సేవలను ఉప‌యోగించుకునేందుకు ఈ స‌మావేశం జ‌రిగ‌న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అధికారిక ధృవీకరణ లేనప్పటికీ.. మిథాలీ రాజ్ కు ఉన్న‌ విస్తృత ప్రజాదరణ, ఫాలోయింగ్ దృష్ట్యా బీజేపీ ఈ భేటీని ఏర్పాటు చేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవ‌ల ఎన్టీఆర్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే.


Next Story