హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ కలకలం

హైదరాబాద్‌ నగరంలో బర్డ్‌ప్లూ విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.

By Medi Samrat
Published on : 2 April 2025 7:06 PM IST

హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ కలకలం

హైదరాబాద్‌ నగరంలో బర్డ్‌ప్లూ విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. వైద్య శాఖ అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించారు. బర్డ్‌ ఫ్లూ వల్లే ఆ కోళ్లు మృత్యువాత పడినట్లు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు హెచ్చరించారు.

రెండేళ్ల బాలిక బర్డ్‌ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే మొదటిసారి. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మార్చి 16వ తేదీన మృతి చెందింది. పాప స్వాబ్‌ నమూనాలను పరీక్షించగా బర్డ్‌ ఫ్లూగా తేలింది.

Next Story