షేక్‌పేట ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. యువకుడు మృతి

Biker falls to death from new Shaikpet flyover. హైదరాబాద్‌ నగరంలో శనివారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలే కొత్తగా ప్రారంభించిన షేక్‌పేట ఫ్లైఓవర్‌పై నెత్తురోడింది.

By అంజి  Published on  5 Feb 2022 5:55 AM GMT
షేక్‌పేట ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. యువకుడు మృతి

హైదరాబాద్‌ నగరంలో శనివారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలే కొత్తగా ప్రారంభించిన షేక్‌పేట ఫ్లైఓవర్‌పై నెత్తురోడింది. ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఓ వాహనదారుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయాడా లేక ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనేది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పద్మారావు నగర్‌కు చెందిన ప్రీతమ్ భరద్వాజ్ (27) అనే వ్యక్తి మెహదీపట్నం నుండి ఫ్లైఓవర్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

" అతను హెల్మెట్ ధరించాడు కానీ అది గట్టిగా పట్టుకోలేదు. అతను ఫ్లైఓవర్ నుండి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మరణించాడు. "అని ఒక అధికారి తెలిపారు. రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. "సంఘటన జరిగిన ప్రదేశంలో ఎలాంటి నిఘా కెమెరాలు లేవు. అతను వాహనంపై నియంత్రణ కోల్పోయి ఫ్లైఓవర్‌పై నుండి పడిపోయాడా లేదా మరొక వాహనం ఢీకొట్టిందా అనే దానిపై మేము దర్యాప్తు చేస్తున్నాము."అని అధికారి తెలిపారు.

Next Story