మందుబాబులకు బ్యాడ్ న్యూస్
హైదరాబాద్ లోని మందుబాబులకు అధికారులు షాకిచ్చారు.
By Medi Samrat
హైదరాబాద్ లోని మందుబాబులకు అధికారులు షాకిచ్చారు. ఏప్రిల్ 12వ తేదీ, శనివారం నాడు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. వైన్ షాపులు, బార్లతో పాటు కల్లు కాంపౌండ్ లను కూడా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
హనుమాన్ విజయ యాత్ర కోసం హైదరాబాద్ పోలీసులు 17,000 మంది సిబ్బందిని, అదనపు సాయుధ బలగాలను మోహరించనున్నారు. ఊరేగింపు గౌలిగూడలోని రామమందిరం నుండి ప్రారంభమై నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, కవాడిగూడ, బైబిల్ హౌస్ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 12.2 కి.మీ. దూరం సాగుతుంది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 150 శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రలు జరగనున్నాయి. అదనంగా, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుండి మరో 46 యాత్రలు ప్రారంభమవుతాయి, ఇవన్నీ ప్రధాన ఊరేగింపుగా కలుస్తాయి.