ఓల్డ్ సిటీ మొత్తం బంద్ అయింది తెలుసా.?

కొన్ని వారాల క్రితం మహమ్మద్ ప్రవక్తపై సాధువు యతి నర్సింహానంద చేసిన వ్యాఖ్యలపై అక్టోబర్ 29, మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అంతటా బంద్ పాటించారు

By Medi Samrat  Published on  29 Oct 2024 8:45 PM IST
ఓల్డ్ సిటీ మొత్తం బంద్ అయింది తెలుసా.?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

కొన్ని వారాల క్రితం మహమ్మద్ ప్రవక్తపై సాధువు యతి నర్సింహానంద చేసిన వ్యాఖ్యలపై అక్టోబర్ 29, మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అంతటా బంద్ పాటించారు. పాతబస్తీలోని చాలా దుకాణాలను మూసివేశారు. కొన్ని ఇళ్ల ముందు నల్ల జెండాలు ఉంచారు. జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు తెహ్రీక్ ముస్లిం షబ్బాన్, చైర్‌పర్సన్ ముస్తాక్ మాలిక్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ నేపథ్యంలో మైనారిటీ విద్యాసంస్థలు, షాపులు, పాత మార్కెట్లు మూతపడ్డాయి.

ఈ బంద్ ముస్లిం సమాజానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. బంద్ లో పాల్గొనడానికి ఇతర మత వర్గాల వ్యక్తులకు JAC ఎటువంటి నోటీసు జారీ చేయలేదు. బంద్ లో చేరమని బలవంతం చేయరని మాలిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ముహమ్మద్ ప్రవక్తపై యతి నర్సింహానంద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హైదరాబాద్ పాతబస్తీలో బంద్ కు పిలుపునిచ్చారు. ప్రతి దసరాకు మీరు దిష్టిబొమ్మలను దహనం చేయవలసి వస్తే, అప్పుడు మహమ్మద్ ప్రవక్త దిష్టిబొమ్మలను కాల్చాలంటూ అయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Next Story