హ‌రీష్ రావుతో బాల‌కృష్ణ భేటీ

Balakrishna Meet With Harish Rao. తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో బసవతారకం ఇండో అమెరికన్

By Medi Samrat  Published on  10 Jan 2022 5:58 PM IST
హ‌రీష్ రావుతో బాల‌కృష్ణ భేటీ

తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ నేడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను బాలకృష్ణ మంత్రి హరీష్ రావుకి వివరించారు. అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి.. ప్రభుత్వం నుండి తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సీఈఓ డా. ఆర్ వి ప్రభాకర రావు కూడా పాల్గొన్నారు.


Next Story