హైదరాబాద్‌లో దేవాలయాలను ధ్వంసం చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్ దళ్ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. భజరంగ్ దళ్ తెలంగాణ విభాగం అక్టోబర్ 19, శనివారం నాడు కలెక్టరేట్ల వద్ద నిరసనను ప్రకటించింది. హైదరాబాద్‌లో ఆలయాలను ధ్వంసం చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయనున్నారు. భజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ శివరాములు వీడియోను విడుదల చేసి హిందువులంతా ఈ కార్యక్రమాల్లో భాగమవ్వాలని కోరారు.
నిందితుల పట్ల ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని భజరంగ్ దళ్ నేతలు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా, హైదరాబాద్‌లోని కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా, దేవాలయాన్ని కూడా అపవిత్రం చేశారని భజరంగ్ నేతలు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. నిందితులను పట్టుకున్నా మానసిక అనారోగ్యం బాలేదంటూ వారిని విడిచిపెట్టారని, వీటికి నిరసనగా తాము పెద్ద ఎత్తున ఆందోళనలకు చేపడుతున్నామన్నారు.