హైద‌రాబాద్‌ : చింతల్ బస్తీ నాలలో ప్రత్యక్షమైన మొసలి పిల్ల

ఖైరతాబాద్ చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల హ‌ల్ చ‌ల్ చేసింది.

By Medi Samrat  Published on  27 Sept 2023 9:15 PM IST
హైద‌రాబాద్‌ : చింతల్ బస్తీ నాలలో ప్రత్యక్షమైన మొసలి పిల్ల

ఖైరతాబాద్ చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల హ‌ల్ చ‌ల్ చేసింది. నగరంలో ఒకవైపు గణేష్ నిమజ్జ‌నం కొనసాగుతూ ఉండ‌గా.. మరోవైపు నగరంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వరద నీరు రోడ్లపై పొంగిపొర్లుతూ చెరువులను తలపించాయి.

ఇదిలావుండ‌గా.. చింతల్ బస్తి ప్రధాన నాళాలోకి మొసలి కొట్టుకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కురిసిన వర్షం నేపథ్యంలో నీటి ఉధృతికి మొసలి పిల్ల రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. నాలా వంతెన నిర్మాణం జరుగుతున్న బల్కపూర్ కాలువలో మొసలి పిల్ల ప్రత్యక్షం అవ్వడంతో.. స్థానికులు భయభ్రాంతులతో అక్కడి నుండి పరుగులు తీశారు. ప‌లువురు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story