ముస్లింల దేశభక్తిని శంకించవద్దని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మదర్సాలలో బాంబుల తయారీ క్షమించరాని నేరమన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో హిందువులే కాదు, ముస్లింలూ ఉన్నారన్నారు. మదర్సాలలో గదిని నిర్మించలేని మూర్ఖులు బాంబులు తయారు చేసి మతానికి చెడ్డపేరు తెస్తున్నారని, దేశానికి శత్రువులు.. ముస్లింలకూ శత్రువులే అని స్పష్టం చేశారు అసదుద్దీన్ ఒవైసీ.
ఇలాంటి చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా, ముస్లింలపై అనవసర అపవాదాలు మోపడానికి కారణమవుతున్నాయని అసదుద్దీన్ అన్నారు. మరణించిన వారిలో హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా ఉన్నారన్నారు.