పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌కు మరో రెండు రోజులు ఎల్లో అలర్ట్.!

Another two-day yellow alert for Hyderabad. హైదరాబాద్‌లో రాత్రులు చలిగా మారవచ్చు. వారాంతంలో హైదరాబాద్‌తో పాటు కొన్ని పొరుగు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు

By అంజి  Published on  10 Feb 2022 2:28 PM GMT
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌కు మరో రెండు రోజులు ఎల్లో అలర్ట్.!

హైదరాబాద్‌లో రాత్రులు చలిగా మారవచ్చు. వారాంతంలో హైదరాబాద్‌తో పాటు కొన్ని పొరుగు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ నగరంతో పాటు ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియు నమోదైంది. రాజేంద్రనగర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 15.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) వివిధ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లలో (ఎడబ్ల్యుఎస్) నమోదు చేసిన డేటా ప్రకారం, శని, ఆదివారాల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. హయత్‌నగర్, ఎల్‌బి నగర్, ఫలక్‌నుమా, ఉప్పల్, మల్కాజ్‌గిరి వంటి అనేక ప్రాంతాల్లో ఈ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. అయితే, అల్వాల్, కుతుబుల్లాపూర్‌తో సహా నగరంలోని ఉత్తర ప్రాంతాలు వేడి రాత్రులను ఆస్వాదించే అవకాశం ఉంది. వారాంతంలో హైదరాబాద్‌లో సగటు రాత్రి ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

గత రెండు రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుండగా, పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 2.5 మి.మీ వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

Next Story