శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు ఈమెయిల్.. ఈ ఏడాది 28వ సారి

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.

By -  Knakam Karthik
Published on : 23 Dec 2025 10:37 AM IST

Hyderabad News, Shamshabad Airport, bomb threat email, Hyderabad Police

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు ఈమెయిల్.. ఈ ఏడాది 28వ సారి

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది వెంటనే ఏర్పాటు మొత్తం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో సహా ఇతర భద్రత బృందాలు ఏర్పాటు మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రయాణికుల టెర్మినల్స్, కార్గో ఏరియా, పార్కింగ్ ప్రాంతాలు విమానాల వద్ద చెకింగ్ చేశారు. అన్నిచోట్ల తనిఖీలు చేసిన తర్వాత ఇది ఫేక్ బెదిరింపు ఈమెయిల్ గా భద్రత అధికారం నిర్ధారించారు.

అయితే ఫేక్ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పై పోలీసులు సీరియస్ అయ్యారు.. ఈ ఏడాది ఒక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 28 సార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇలా ప్రతిసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై అన్ని చోట్ల చెకింగ్ చేశాక అది ఫేక్ ఈమెయిల్ గా నిర్ధారణ అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారని తెలిపారు. ఇప్పటికే బాంబు బెదిరింపులపై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్లో 28 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆలోచిస్తున్నారు. కేటుగాళ్లు కావాలనే డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ పంపిస్తున్నట్లుగా పోలీసులు అనుమాని స్తున్నారు. ఆధునిక సైబర్ టెక్నాలజీ సహాయంతో ఈ కేటుగాళ్లను పట్టుకునే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి ఈమెయిల్ పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ పోలీసులు ఫేక్ బెదిరింపు ఈమెయిల్స్ కేసులు అన్నిటిని సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేయనున్నారు.

Next Story