అమిత్ షా ఈరోజు హైదరాబాద్‌లోని 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ'ని సందర్శించనున్నారు. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 4.40 గంటలకు అమిత్ షా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకి చేరుకుంటారు. అక్కడి నుంచి ముంచింతల్ చేరుకుని 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ) సందర్శిస్తారు.
అనంతరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 108 దివ్యదేశాలను దర్శించుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాత్రి 8 గంటలకు అమిత్ షా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ముచ్చింతల్‌లో సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఫిబ్రవరి 13న ముచ్చింతల్‌లో పర్యటించనున్నారు.