ఆల్ఫా హోటల్.. 'మటన్ కీమా రోటీ' తిని అస్వస్థత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్లో ఆహారం తిని అస్వస్థతకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sept 2023 7:14 PM IST
ఆల్ఫా హోటల్.. మటన్ కీమా రోటీ తిని అస్వస్థత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్లో ఆహారం తిని అస్వస్థతకు గురైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం లోయర్ ట్యాంక్ బండ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ జమాలుద్దీన్ తన స్నేహితులు మహ్మద్, ప్రవీణ్, ఖలీల్, ఉస్మాన్ ఖాన్లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆల్ఫా హోటల్‌కి వెళ్లారు. అక్కడకు వెళ్లాక మటన్ కీమా రోటీ తీసుకుని తిన్నారు. తిన్న కొద్ది సేపటికే జమాలుద్దీన్ స్నేహితుడు మహ్మద్ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే వాంతులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని సిబ్బందికి సూచించారు జమాలుద్దీన్. అరగంట తర్వాత ఓ వ్యక్తి తను మేనేజర్‌ను అంటూ రాగా, జరిగింది చెప్పారు. రోటీ నుండి దుర్వాసన కూడా వస్తుందని చెప్పగా అతడేమీ పట్టించుకోలేదు. దీంతో జమాలుద్దీన్ ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్కెట్ పోలీసులు ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై ఐపీసీలోని సెక్షన్ 273, 336 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

కస్టమర్ అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ జమాలుద్దీన్ (40) అనే వ్యక్తి హోటల్ పై మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జమాలుద్దీన్ అతని స్నేహితులు మటన్ ఖీమా రోటీ సరిగా వండలేదని, దుర్వాసన వచ్చిందని పోలీసులకు తెలిపారు. చట్ట ప్రకారం హోటల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Next Story