రాష్ట్రానికి చెందిన హైడ్రా ఏజెన్సీ అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా డ్రైవ్ కొనసాగుతూ ఉండగా.. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తాను స్థాపించిన సంస్థలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, విద్యను చూసి కొంతమందిలో అసూయ నెలకొందని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. నిరుపేదల బతుకులు మార్చడానికి తాను చేసిన ప్రయత్నాలను అణగదొక్కాలని పలువురు ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపించారు. ఎవరికైనా నాతో శత్రుత్వం ఉంటే.. వచ్చి కత్తులు, తుపాకీలతో నన్ను అంతం చేయండి. కానీ నా మంచి పనిని ఆపడానికి మాత్రం ప్రయత్నించవద్దని అక్బరుద్దీన్ అన్నారు.
ఒవైసీ అక్రమ భూమిని ఆక్రమించాడా అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ, రాజేంద్రనగర్‌లోని బం-రుక్న్-ఉద్-దౌలా సరస్సులోని 12 ఎకరాలను ఆగస్టులో హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. సరస్సు ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో కూల్చివేసిన అక్రమ నిర్మాణాలు AIMIM నేత మహమ్మద్ ముబీన్, MLC మీర్జా రహమత్ బేగ్‌లకు చెందినవి. అక్రమ నిర్మాణాల్లో రెండు గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తుల భవనాలు, 40 కాంపౌండ్ వాల్స్, గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులతో కూడిన ఒక భవనం ఉన్నాయి.