గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Accident In Gachibowli. రాజధాని నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌

By Medi Samrat  Published on  13 Dec 2020 8:40 AM IST
గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

రాజధాని నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ లారీ.. కారును వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీస్తున్నారు.

పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు, కారు సిగ్నల్‌ జంప్‌ చేయడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story