హైదరాబాద్‌లో రాత్రుళ్లు లిప్ట్‌ పేరుతో.. ట్రాన్స్‌జెండర్‌ చేసే పని ఇది.!

A transgender person committing a series of crimes in Hyderabad. ఈ క్రమంలోనే అంజుమ్‌ అప్పుడప్పు హైదరాబాద్‌ వచ్చి తన తోటి ట్రాన్స్‌ జెండర్లతో కలిసి ఉండి వెళ్లేది. గత కొద్ది రోజుల క్రితం అంజుమ్‌కు

By అంజి  Published on  20 Nov 2021 8:49 AM GMT
హైదరాబాద్‌లో రాత్రుళ్లు లిప్ట్‌ పేరుతో..  ట్రాన్స్‌జెండర్‌ చేసే పని ఇది.!

హైదరాబాద్‌లో బైక్‌ లిఫ్ట్‌ పేరుతో వరుస మోసాలకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన అంజుమ్‌ 8 ఏళ్ల కిందట ట్రాన్స్‌జెండర్‌ మారింది. అప్పటి నుండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే అంజుమ్‌ అప్పుడప్పు హైదరాబాద్‌ వచ్చి తన తోటి ట్రాన్స్‌ జెండర్లతో కలిసి ఉండి వెళ్లేది. గత కొద్ది రోజుల క్రితం అంజుమ్‌కు బెంగళూరు చెందిన బసవరాజ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో.. చనువుగా ఉంటూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ, పెద్ద పెద్ద హోటళ్లలో బస చేస్తూ ఏంజాయ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వాటికి అవసరమైన డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని ప్లాన్‌ వేసుకున్నారు. నవంబర్‌ 12వ తేదీన అంజుమ్‌, బసవరాజ్‌లు విమానంలో హైదరాబాద్‌కు వచ్చి సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేశారు. ప్లాన్‌ ప్రకారం రాత్రి అంజుమ్‌ రోడ్డుపైకి వచ్చి మారేడ్‌పల్లి నుండి బేగంపేట వెళ్తున్న రాజేందర్‌ అనే వ్యక్తిని ప్యారడైజ్‌ సర్కిల్‌ దగ్గర లిఫ్ట్‌ అడిగింది. పాపం అని రాజేందర్‌ ఆమెను కారు ఎక్కించుకున్నాడు. కారులో రాజేందర్‌తో అంజుమ్‌ అసభ్యకరంగా ప్రవర్తించింది. దీంతో రాజేందర్‌ ఆమెను కారు దిగమన్నాడు. వెంటనే అదును చూసుకుని రాజేందర్‌ మెడిలోని గొలుసు, ల్యాప్‌టాప్‌ తీసుకుని పారిపోయింది. దీంతో బాధితుడు మహంకాళి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇక అదేరోజు అమీర్‌పేటలో బైక్‌పై వెళ్తున్న ఈశ్వర్‌ ప్రసాద్‌ను లిఫ్ట్‌ అడిగి ఎక్కింది. పంజాగుట్ట సర్కిల్‌ వరకు బైక్‌పై వెళ్లిన అంజుమ్‌.. అతడి మెడలోని చైన్‌ను దొంగతనం చేసి దిగి వెళ్లిపోయింది. ఈ ఘటపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ కేసు నమోదైంది. దీంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మొదటగా ఓ యువతి ఇదంతా చేసిందని భావించిన పోలీసుల.. ఆ తర్వాత సీసీ ఫుటేజీ ఆధారంగా ట్రాన్స్‌జెండర్‌గా తేల్చారు. నిందితులు బస చేస్తున్న లాడి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి దొంగతనం చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Next Story