Secunderabad : పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చింది.. నాలా మింగేసింది

A girl Falls into manhole in Secunderabad in Telangana. సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్ పడి బాలిక మృతి చెందింది.

By M.S.R
Published on : 29 April 2023 10:30 AM IST

Secunderabad : పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చింది.. నాలా మింగేసింది

సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్ పడి బాలిక మృతి చెందింది. పాల ప్యాకెట్ కోసం అన్నతో కలిసి బయటకు వచ్చిన మౌనిక నీటిలో కొట్టుకుపోయింది. ఏప్రిల్ 29వ తేదీ తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో భారీ వర్షం కారణంగా మ్యాన్ హోళ్లు పొంగిపొర్లాయి. మౌనిక (6) తన అన్నతో కలిసి కిరాణా షాపుకు పాలపాకెట్ కోసం బయటకు వచ్చింది. ఈ సమయంలో వర్షపు నీరంతా అక్కడే తెరిచి ఉన్న నాలాలోకి ప్రవహిస్తోంది. నాలా తెరిచి ఉందని మౌనిక ఆమె అన్న గమనించలేదు. ఓ గోడను పట్టుకుంటూ అన్న, చెల్లెలు కిరాణా షాపు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో మౌనిక అన్న కాలు జారి మ్యాన్ హోల్ దగ్గర పడ్డాడు. అన్న పడిపోవడంతో అతన్ని పట్టుకోడానికి మౌనిక ప్రయత్నించి నాలాలో పడిపోయింది. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో ఆ ధాటికి మౌనిక కొట్టుకుపోయింది. నీళ్లల్లో కొట్టుకుపోయిన మౌనిక మృతదేహం పార్క్ లేన్ వద్ద బయట పడింది. మౌనిక పడిన నాలా దగ్గర గత నాలుగు రోజులుగా పనులు జరుగుతున్నాయి. అందుకే నాలాను తెరిచారు. కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం మరిచారని స్థానికులు చెబుతున్నారు.


Next Story