కిడ్నాపైన బాలుడిని 12 గంటల్లో తల్లి దగ్గరకు చేర్చిన హైదరాబాద్ పోలీసులు

అఫ్జల్‌గంజ్ పోలీసులు మంగళవారం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) నుండి కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడిని రక్షించారు

By Medi Samrat  Published on  5 Nov 2024 6:06 PM IST
కిడ్నాపైన బాలుడిని 12 గంటల్లో తల్లి దగ్గరకు చేర్చిన హైదరాబాద్ పోలీసులు

అఫ్జల్‌గంజ్ పోలీసులు మంగళవారం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) నుండి కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడిని రక్షించారు. దబీర్‌పురా రైల్వే స్టేషన్‌లో కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు. కేవలం 12 గంటల్లో పిల్లాడిని రక్షించి అతని కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని వరంగల్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన షేక్ రఫీక్ అలియాస్ రఫీ (35)గా గుర్తించారు.

మల్లేపల్లిలోని అఫ్జల్‌సాగర్‌కు చెందిన రుబీనాబేగం భర్త మహ్మద్ సద్దాం తన నాలుగేళ్ల కొడుకు మహ్మద్ షోహెబ్‌తో కలిసి ఓజీహెచ్‌కు వెళ్ళాడు. ఎంతసేపటికీ భర్త, పిల్లాడు ఇంటికి రాకపోవడంతో సాయంత్రం రుబీనా OGH కి వచ్చింది. మద్యం మత్తులో రుబీనా భర్త ఆసుపత్రి వెయిటింగ్ హాల్ వద్ద నిద్రిస్తూ కనిపించాడు. అయితే పిల్లాడు అక్కడ లేడు. బాలుడి కోసం అన్ని ప్రదేశాలలో వెతికిన తర్వాత, రుబీనా పోలీసులను ఆశ్రయించింది. పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఇంతలో పోలీసులు దబీర్‌పురా ఫ్లైఓవర్ వద్ద బాలుడితో పాటు అనుమానితుడిని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం బాలుడితో పాటు దబీర్‌పురా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న కిడ్నాపర్‌ను పట్టుకుంది. తల్లి దగ్గరకు పిల్లాడిని చేర్చారు.

Next Story