సైబరాబాద్ పోలీసులకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ మైదానంలో వివిధ రకాల కంపెనీలకు చెందిన 357 వాహనాలు ఉన్నాయి. వీటిని కొందరు వదిలేయగా, మరికొందరేమో క్లెయిమ్ చేయడానికి ముందుకు రాలేదు. అయితే వీటిని వేలం వేయాలని అధికారులు ఫిక్స్ అయ్యారు. సంబంధిత చట్టాల కింద ఆన్‌లైన్ లేదా బహిరంగ వేలం ద్వారా ఈ వాహనాలను అమ్మేయాలని ప్రతిపాదించారు.
ఈ వాహనాల యాజమాన్య హక్కుదారు లేదా హైపోథెకేషన్ ఆసక్తి ఉన్నవారికి ఎవరైనా అభ్యంతరం ఉంటే, నోటిఫికేషన్ తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలోపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు దరఖాస్తును దాఖలు చేయవచ్చు. లేని పక్షంలో వదిలివేయబడిన లేదా క్లెయిమ్ చేయని వాహనాలను బహిరంగ వేలం నిర్వహిస్తారు.
వాహనాల వివరాలు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. వీరలింగం నియంత్రణలో ఉన్న మోయినాబాద్ పోలీస్ స్టేషన్ మైదానంలో ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.cyberabadpolice.gov.inలో అందుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.