విషాదం..16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..!

16-year-old boy commits suicide in Hyderabad. ప్రేమ వ్యవహాం కారణంగా మైనర్‌ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ నగరం నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌

By అంజి  Published on  27 Oct 2021 7:50 AM GMT
విషాదం..16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..!

ప్రేమ వ్యవహాం కారణంగా మైనర్‌ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ నగరం నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ వ్యవహారం ఈ రెండింటినీ భరించలేకే బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్‌ కోఠిలో నివాసం ఉంటున్న ఎం.డి.అంజాద్‌ఖాన్, రజ్వీయా సుల్తానాల దంపతుల కుమారుడు ఎం.డి.అక్బర్‌ఖాన్‌ (16) ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో తన క్లాస్‌మేట్‌ అమ్మాయితో ప్రేమ వ్యవహారం మొదలు పెట్టాడు.

దీంతో చదువుపై ఆసక్తి తగ్గింది. ఈ విషయం కాస్తా తల్లిదండ్రులకు తెలియడంతో బాలుడిని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పలుసార్లు మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు.. రాత్రి సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సమయంలో ఎంతకీ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం రావడంతో రూమ్‌ కిటికీ డోర్‌ తీసి చూడగా.. ఫ్యాన్‌ ఉరివేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story