ఓ రోగికి కిడ్నీలో.. 156 రాళ్లను తొలగించిన హైదరాబాద్‌ వైద్యులు

156 kidney stones removed from a patient in Hyderabad. పాఠశాల ఉపాధ్యాయుడు బసవరాజ్ మడివాలర్ అనే 50 ఏళ్ల రోగికి లాపరోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ ద్వారా 156 కిడ్నీ రాళ్లను తొలగించారు.

By అంజి  Published on  16 Dec 2021 2:28 PM GMT
ఓ రోగికి కిడ్నీలో.. 156 రాళ్లను తొలగించిన హైదరాబాద్‌ వైద్యులు

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో గల ప్రీతి యూరాలజీ, కిడ్నీ హాస్పిటల్‌లోని యూరాలజిస్టులు కర్ణాటకలోని హుబ్లీకి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు బసవరాజ్ మడివాలర్ అనే 50 ఏళ్ల రోగికి లాపరోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ ద్వారా 156 కిడ్నీ రాళ్లను తొలగించారు. రోగికి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరగా, పరీక్షల్లో మూత్రపిండ రాళ్ల పెద్ద సమూహం ఉన్నట్లు తేలింది. అతను ఎక్టోపిక్ కిడ్నీని కూడా కలిగి ఉన్నాడు. మూత్ర నాళంలో దాని సాధారణ స్థితికి బదులుగా ఉదరం సమీపంలో కలిగి ఉన్నాడు. ఇది మూత్రపిండ రాళ్లను తొలగిస్తున్నప్పుడు సర్జన్లకు సవాళ్లను విసిరింది.

ప్రీతి యూరాలజీ, కిడ్నీ హాస్పిటల్ యూరాలజిస్ట్ ఎండీ డాక్టర్ వి చంద్ర మోహన్ మాట్లాడుతూ.. "రోగిలో గత రెండేళ్లుగా ఈ రాళ్లను సమూహం పెరిగిందని, కానీ ఎప్పుడూ ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. అతని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, మేము పెద్ద శస్త్రచికిత్సకు బదులుగా రాళ్లను వెలికితీసేందుకు లాపరోస్కోపీ, ఎండోస్కోపీ మార్గాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాము. అని తెలిపారు. ప్రణాళిక ప్రకారం మూడు గంటల పాటు కొనసాగే ప్రక్రియతో రాళ్లను పూర్తిగా వెలికితీశారు. శరీరంపై పెద్ద కోతకు బదులుగా, సాధారణ కీహోల్ ఓపెనింగ్ రాళ్లను పూర్తిగా తీయడంలో సహాయపడింది. "రోగి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అతని సాధారణ దినచర్యకు తిరిగి వచ్చాడు" అని డాక్టర్ చంద్ర మోహన్ పేర్కొన్నారు.

Next Story