రెండవ రోజు 14 నామినేష‌న్లు

రాష్ట్ర శాస‌న స‌భ‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌కుగాను హైద‌రాబాద్ జిల్లాలో రెండవ రోజు శనివారం 14 నామినేష‌న్లు దాఖ‌లు కాగా

By Medi Samrat  Published on  4 Nov 2023 8:45 PM IST
రెండవ రోజు 14 నామినేష‌న్లు

రాష్ట్ర శాస‌న స‌భ‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌కుగాను హైద‌రాబాద్ జిల్లాలో రెండవ రోజు శనివారం 14 నామినేష‌న్లు దాఖ‌లు కాగా.. మొత్తం ఇప్పటి వరకు 20 నామినేషన్లు దాఖలయ్యాయని హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. నేడు ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ధర్మ సమాజ్ పార్టీ నుండి ముత్యాల రాజేష్, మలక్ పేట్ నియోజకవర్గం నుండి రెండు నామినేషన్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సయ్యద్ బిలాల్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి అల్గోల రమేష్ లు నామినేషన్లు దాఖలు చేశారు. అంబర్ పేట్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దేవరుప్పల శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మహ్మద్ మాజీద్ నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుదిరెడ్డి శివ శంకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నాంపల్లి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS) నుండి సంతోష్ కుమార్ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (BJP) నుండి టి.రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. యాకత్ పుర నియోజకవర్గంలో రెండు నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ అక్రం ఆలీ ఖాన్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎ.సరిత నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రమజీవి పార్టీ నుండి జాజుల భాస్కర్ నామినేసన్ దాఖలు చేశారు.

రెండవ రోజు 14 నామినేష‌న్లు

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో SUCI (కమ్యునిస్టు) పార్టీ అభ్యర్థి కురకుల జ్యోతి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా షాబాద్ రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో రెండు నామినేషన్లు దాఖలు కాగా అందులో సోషలిస్టు పార్టీ అభ్యర్థి బి.వి.రమేష్ బాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొగిలి సునిత నామినేషన్లు దాఖలు చేశారు. మలక్ పేట్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గా మహమ్మద్ అక్రం అలీ ఖాన్, అంబర్ పేట్ నియోజకవర్గంలో శివసేన (UBT) పార్టీ అభ్యర్థిగా సుదర్శన్ అందారపు నామినేషన్లను దాఖలు చేశారు.

రెండవ రోజు సికింద్రాబాద్, కర్వన్, బహద్దుర్ పూర , సనత్ నగర్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ నియోజక వర్గాలలో ఎవ్వరూ కూడా నామినేషన్ వేయలేదు.

కాగా ఎన్నిక‌ల సంఘం జారీచేసిన నోటిఫికేష‌న్‌ను అనుసరించి నేడు నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు స్వీక‌రించే నామినేష‌న్ల‌ను ఉద‌యం 11గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 3గంట‌ల వ‌ర‌కు సంబంధిత రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యాల్లో అభ్య‌ర్థులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

Next Story