గచ్చిబౌలిలో గ్యాంబ్లింగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు
12 arrested for gambling in Gachibowli. గచ్చిబౌలిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 12 మందిని సైబరాబాద్ పోలీసుల
By Medi Samrat Published on
22 Jan 2022 6:10 AM GMT

గచ్చిబౌలిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 12 మందిని సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ.9.02 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గచ్చిబౌలిలోని గ్రీన్‌ల్యాండ్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌పై దాడి చేశారు. జూదగాళ్లను ఆహ్వానించి కాకర్ల మార్కా రెడ్డి అనే వ్యక్తి మూడు ముక్కలాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
గ్యాంబ్లింగ్ కోసం రోజుకు రూ.6వేలు చెల్లించి మార్కా రెడ్డి అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ బుక్ చేసుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. "మార్కారెడ్డి ప్రతి గేమ్‌కు పాల్గొనే వారి నుండి కమీషన్ వసూలు చేశాడు. అతను జూదంలో పాల్గొనడానికి వ్యాపారవేత్తలను ఆహ్వానించాడు" అని పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం అరెస్టు చేసిన వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు స్పెషల్ ఆపరేషన్ టీమ్.
Next Story