ఏదైనా వ్యాపారానికి ప్రచారం చాలా ముఖ్యం. ప్రమోషన్లు లేకపోవడంతో వ్యాపారంలో నష్టాలు చవిచూసిన సందర్భాలున్నాయి. ప్రమోషన్‌లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, పబ్లిక్ యాక్టివ్‌గా ఉండే ఇతర సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. ఇదే సందర్భంలో.. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన 10 ఏళ్ల బాలుడు మహ్మద్ అద్నాన్ తన తండ్రి హలీమ్‌ను తయారు చేస్తున్న వీడియోను రికార్డ్ చేసి, దానిని ఎలా తయారు చేస్తున్నారో కూడా అందులో వివరించాడు. దానిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అంతకుముందు రోజుకు 10 ప్లేట్ల హలీమ్‌ను అమ్మడం తండ్రికి కష్టంగా ఉండేది. అద్నాన్.. తండ్రి వ్యాపార ప్రమోషన్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు తీసుకెళ్లడంతో.. బోరబండలోని 'పప్పా కి హలీమ్' దుకాణానికి జనం పోటెత్తారు. మహ్మద్ అద్నాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు కనీసం 10 ప్లేట్ల హలీమ్ అమ్మేందుకు తండ్రీకొడుకులు రాత్రి 12 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఫలితంగా రోజుకు 150-200 ప్లేట్లు అమ్ముడవుతున్నాయని తెలిపాడు.