హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్
By సుభాష్ Published on 9 May 2020 6:50 AM ISTదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక దేశ వ్యాప్తంగా మే 17వ తేదీ వరకు కేంద్రం లాక్‌డౌన్ విధిస్తే.. తెలంగాణలో మాత్రం మే 29వ తేదీకి పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని గత 14 రోజులకుపైగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇప్పటికే కొన్ని జిల్లాలను గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో ఉండగా హైదరాబాద్‌తో పాటు మరో మూడు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.
ఇక లాక్‌డౌన్ నిబంధనల్లో తెలంగాణ సర్కార్ కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌లో మళ్లీ కార్యకలాపాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంతో వెలవెలబోయిన రోడ్లన్నీ వాహనాల రాకపోకలతో మళ్లీ కాస్త ట్రాఫిక్ మొదలైంది. మామూలు రోజులతో పోల్చుకుంటే 35 శాతం వరకూ వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్స్, లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్, రవాణాశాఖ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు తమ తమ విధులకు హాజరవుతున్నారు. ఇక ఐటీ పరిశ్రమల్లోనూ 34శాతం వరకు ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే సడలింపులు ఇచ్చిన రంగాలకు చెందిన వారు మాత్రమే బయటకు రావాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక మున్ముందు కూడా రోడ్లపై మరింత రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయి. ముందు మొదటి, రెండు దశల్లో విధించిన లాక్‌డౌన్ మూడో దశలో పెద్దగా కనిపించడం లేదు. కొంత వెసులు బాటు ఇవ్వడంతో వెలవెలబోయిన రోడ్లన్నీ జనాలు, వాహనదారులతో సందడి సందడికి కనిపిస్తోంది.